ETV Bharat / city

బాల్య వివాహం విషయంలో చైల్డ్​ లైన్​ సిబ్బంది చేతివాటం? - ఏపీ తాజా వార్తలు

Child line staff Irregularities: ఓ బాల్య వివాహం విషయంలో చైల్డ్ లైన్ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?

child marriage
బాల్య వివాహం
author img

By

Published : Sep 11, 2022, 4:12 PM IST

Child line staff Irregularities: బాల్య వివాహాలను అరికట్టాలని మొత్తం మానవ సమాజమే చెప్పుతుంటే ఆ బాల్య వివాహం విషయమై చైల్డ్‌లైన్‌ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు బాల్య వివాహం జరిగినట్లు స్థానిక వాలంటీర్లు చైల్డ్‌ లైన్‌ 1098కి సమాచారం ఇచ్చారు.

వారు ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో ఉన్న చైల్డ్‌ లైన్‌ సిబ్బందికి తెలియజేశారు. వీరు బాల్య వివాహం చేసుకున్న యువకుడి తల్లిదండ్రులను ఏలూరుకు పిలిపించి బేరసారాలకు సాగించారు. ఈ నేపథ్యంలో బాధితులు మీడియాను ఆశ్రయించారు. వారంలోగా అమ్మాయి పేరున లక్ష రూపాయలు చెల్లించకపోతే యువకుడు జైలుకు వెళ్తాడని చైల్డ్‌ లైన్‌ సిబ్బంది బెదిరించారు.

పేదరికం కారణంగా రూ.20 వేలు మాత్రమే కట్టగలమని ప్రాధేయపడ్డామని బాధితులు తెలిపారు. అయినా ససేమిరా అంటూ.. వారం రోజుల్లోగా రూ.50 వేలు చెల్లించేలా బలవంతంగా సంతకాలు, వేలి ముద్రలు తీసుకున్నారని వాపోయారు. దీనిపై ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.