ETV Bharat / city

తుదిదశకు పీఆర్​సీ.. నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ముఖ్యమంత్రి వద్దకు చేరనుంది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను అధికారుల కమిటీ.. సీఎంకు నివేదించనుంది. పీఆర్​సీ, అధికారుల కమిటీ నివేదికల ఆధారంగా వేతన సవరణపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.

chief minister take decision on prc in the state for govt employees
తుదిదశకు పీఆర్సీ.. నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయం
author img

By

Published : Jan 31, 2021, 5:05 AM IST

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం తుదిదశకు చేరింది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను అధికారుల కమిటీ ముఖ్యమంత్రికి అందజేయనుంది. పీఆర్​సీ, అధికారుల కమిటీ నివేదికల ఆధారంగా వేతన సవరణపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన పీఆర్​సీ నివేదికపై సీఎస్ సోమేశ్ కుమార్ సారథ్యంలోని అధికారుల కమిటీ ఉద్యోగసంఘాలతో చర్చలు జరిపింది. మొత్తం 13 సంఘాల నుంచి అభిప్రాయాలు, వినతులు తీసుకుంది. మరికొన్ని ఇతర సంఘాలు కూడా తమ అభిప్రాయాలను అధికారులకు అందించాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించే పనిలో అధికారులు పడ్డారు. పీఆర్​సీ నివేదికలోని ముఖ్యంశాలు, వాటిపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పేర్కొంటూ నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో పీఆర్​సీ కమిషన్ నివేదిక ప్రకారం ఏ కేటగిరీల వారికి ఎంత మేర అదనపు ఆర్థిక లబ్ధి కలగనుందన్న విషయమై కూడా అధికారులు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే సీఎం నిర్ణయం :

పీఆర్​సీ నివేదికలోని అంశాలు, సమాచారంతో పాటు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారుల కమిటీ ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​కు నివేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం పీఆర్​సీపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. అంతకుముందే మంత్రివర్గాన్ని కూడా సమావేశపరిచే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే ఉద్యోగ సంఘాలతో కూడా సీఎం చర్చించవచ్చు. పీఆర్​సీ నివేదిక బయటకు పొక్కిన వ్యవహారంలో విచారణ పూర్తైనట్లు తెలిసింది. నివేదిక ఎక్కడి నుంచి బయటకు పొక్కిందన్న విషయం తెలిపోయినట్లు సమాచారం. విచారణ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించాక బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : బదిలీలు, పదోన్నతులపై ముఖ్యమంత్రికి ఉపాధ్యాయ సంఘాల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.