ఏపీలో వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో తాము ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. ఇళ్లస్థలాలకు ఆటస్థలాలు, అసైన్డ్ భూములు, శ్మశానాలు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు.
సెంటు, సెంటున్నర స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. కనీసం 2 సెంట్లకుపైగా ఇంటిస్థలం పేదలకు ఇవ్వాలన్న చంద్రబాబు... ఇళ్లస్థలాల పేరుతో మురికివాడలు తయారుచేస్తారా..? అని నిలదీశారు. వైఎస్ హయాంలోనూ అగ్గిపెట్టెలు లాంటి ఇళ్లు కట్టారన్న చంద్రబాబు... ఇళ్ల నిర్మాణానికి సొంత డబ్బు ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : బల్దియాలో పోలింగ్.. పార్టీల మధ్య ఫైటింగ్..