ETV Bharat / city

ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు

author img

By

Published : May 22, 2021, 2:40 PM IST

Updated : May 22, 2021, 4:39 PM IST

"వివేకానందరెడ్డిని చంపినా దిక్కులేదు కాబట్టి.. ఎవరినైనా చంపొచ్చని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా?" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కులాల్ని రెచ్చగొట్టారని రఘురామ కృష్ణరాజుపై కేసు పెట్టిన సీఐడి... వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు కులాన్ని అంటగట్టిన ముఖ్యమంత్రిపై కేసు ఎందుకు పెట్టి అరెస్ట్ చెయ్యలేదని నిలదీశారు. ఏపీ సీఎస్​గా పదవీవిరమణ చేసి.. ఎస్ఈసీ పదవి కోసం కక్కుర్తిపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా అని నీలం సాహ్నీని ఉద్దేశించి చంద్రబాబు మండిపడ్డారు.

cbn on ycp. chandrababu
వైకాపాపై చంద్రబాబు వ్యాఖ్యలు, చంద్రబాబు తాజా వార్తలు

"రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోలేకపోయిన వైద్యుడు సుధాకర్.. చివరికి చనిపోయే పరిస్థితి వచ్చింది" అని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినరోజు నాడు ఎంపీ రఘురామను బలంవంతంగా అరెస్టు చేసి ఆయన కుటుంబానికి మానసిక వేదన మిగిల్చారని విమర్శించారు. పోలీసు కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజు కాళ్లు కట్టేసి బలవంతంగా కొట్టారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు మాట్లాడింది తప్పైతే.. తనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు కాదా? అని చంద్రబాబు నిలదీశారు. ఏ రాజకీయ పార్టీ ఏపీలో స్వేచ్ఛగా పనిచేయకుండా చేస్తున్నారన్నారు.

ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు

హైకోర్టు తీర్పులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశాలుగా మారుస్తామని చంద్రబాబు తెలిపారు. రఘురామకృష్ణరాజును పోలీసులు వేధించారని సుప్రీం కోర్టులో తేలిందన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ వేధింపులకు ఇది పరాకాష్టగా పేర్కొన్నారు. ప్రభుత్వ కస్టడీలో ఉన్నవారికి రక్షణ లేదని తేలిపోయిందని చెప్పారు. మాస్క్ అడిగిన పాపానికి వైద్యుడు సుధాకర్ మానసిక క్షోభకు గురై చనిపోయారని ఆవేదన చెందారు.

ఏపీ సీఎం ఆదేశాలే ముఖ్యమా?

'తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వ్యక్తికి ఎన్నికల కమిషనర్ గా ఉండే అర్హత ఉందా? సుప్రీం కోర్టు తీర్పు కాకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలే ముఖ్యమా? నిబంధనలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలు నిర్వహించి 160 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఆ మొత్తం ఎస్ఈసీ కడతుందా? లేక ముఖ్యమంత్రి కడతారా? మాపై దాడులకు దిగి తప్పుడు కేసులు పెడుతున్నారు. పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలంతా చదవాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు తీర్పుకు అయినా విలువ లేకుండా చేసి, హైకోర్టు తీర్పును సజ్జల వ్యతిరేకించటం దుర్మార్గం. 151మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రన ఇష్టానుసారంగా రౌడీయిజం చేసే హక్కులేదు' - చంద్రబాబు, తెదేపా అధినేత.

'రిజర్వేషన్లు లేకుండా చేస్తారు'

"రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసేందుకు ప్రజలు అధికారం కట్టబెట్టలేదని తెలుసుకోవాలి" అని చంద్రబాబు హితవు పలికారు. పాలన ఇలాగే కొనసాగిస్తే అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు కూడా లేకుండా చేస్తారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టు తీర్పు స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కానీ.. ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు.

'తప్పు చేసిన వారికి శిక్షలుండాలి'

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న చంద్రబాబు.. చేసిన అప్పులు ఏ విధంగా తిరిగి కడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు చేయడమే కాక.. దొడ్డిదారిన అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తున్నారని ఆరోపించారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే సహజీవనం చేయమంటారా? అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థల్ని రోజు రోజుకీ బలహీనపరుస్తున్నారన్న ఆయన.. ఈ చర్యల్ని ప్రజాస్వామ్య వాదులెవ్వరూ సమర్థించరన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నియంత్రణలోకి వచ్చి చట్టాలను గౌరవించాలంటే... తప్పు చేసిన వారికి శిక్షలుండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

'ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదు'

కరోనాతో ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత విమర్శించారు. బ్లాక్ ఫంగస్ భయంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం మాత్రం కక్షసాధింపు చర్యలతో ముందుకుపోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన, బాధ కలుగుతోందని చెప్పారు. నిన్న ఒక్కరోజే 4 సంఘటనలు చోటు చేసుకోవటం ఏపీ దుస్థితికి అద్దం పడుతోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హై కోర్టు అనేక తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదని చంద్రబాబు విమర్శించారు.

ఆనందయ్య వైద్యంపై...

ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ముందుగా అధ్యయనం చేయలేదని చంద్రబాబు విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వైద్య శిబిరాన్ని ప్రారంభించి పెద్దఎత్తున తొక్కిసలాటకు తెరతీశారని చంద్రబాబు ఆక్షేపించారు.

ఇదీ చదవండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

Last Updated : May 22, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.