ETV Bharat / city

తెదేపా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌కాల్.. ఎందుకంటే?! - కార్యకర్తలకు చంద్రబాబు ఫోన్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని​ తెదేపా యువ కార్యకర్తకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. బెదిరింపులకు పాల్పడిన కానిస్టేబుల్​తో ధైర్యంగా మాట్లాడారంటూ ప్రశంసించారు. పార్టీ తరఫున కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

chandra-babu-phone-call-to-tdp-social-media-activist
తెదేపా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌కాల్.. ఎందుకంటే?!
author img

By

Published : Jul 9, 2020, 10:40 PM IST

తెదేపా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌కాల్.. ఎందుకంటే?!

వైకాపా‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నెల్లూరు జిల్లా తెదేపా కార్యకర్త శ్రీకాంత్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేసి బెదిరించడంపై ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం నేతల అరెస్టు‌ల విషయంలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. తాను ఏ తప్పు చేయలేదని... ఎలాంటి బెదిరింపులకు లొంగేదిలేదంటూ తెదేపా కార్యకర్త శ్రీకాంత్ ఫోన్​లో పోలీసులకు సమాధానం ఇచ్చిన ఆడియో వైరల్ అయింది. దీనిని విన్న చంద్రబాబు..ఆ యువ కార్యకర్తకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు.

పోలీసులకు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గుర్తుచేశారు. మీరు చూపిన ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవడానికి మాట్లాడారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా మాతో చెప్పండి. మేం చూసుకుంటాం - శ్రీకాంత్​తో ఫోన్​లో చంద్రబాబు

ఇదీ చదవండి : తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.