ETV Bharat / city

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం.. రేపు టిమ్స్​ను​ సందర్శించే అవకాశం - తెలంగాణలో కరోనా ప్రబావం

కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ నేతృత్వంలోని కేంద్ర బృందం ఇవాళ సాయంత్రం రాష్ట్రానికి చేరుకోనుంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించనుంది.

central team
నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం.. రేపు టిమ్స్​ను​ సందర్శించే అవకాశం
author img

By

Published : Jun 28, 2020, 4:47 AM IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణలో భాగంగా కేంద్ర బృందం ఇవాళ సాయంత్రం రాష్ట్రానికి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు మార్లు కేంద్ర బృందాలు పర్యటించాయి. ఐసోలేషన్ ఏర్పాట్లు, కరోనా చికిత్సా విధానం, పరీక్షలు సహా వివిధ అంశాలను పరిశీలించాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో బృంద సభ్యులు చర్చించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్రం బృందం మరోసారి రాష్ట్రానికి రానుంది. ఈనెల 26 నుంచి 29 మధ్య కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణల్లో పర్యటిస్తోంది. మిగిలిన రెండు రాష్ట్రాల్లో దాదాపుగా పర్యటన పూర్తి చేసుకున్న బృందం ఆదివారం సాయంత్రానికి రాష్ట్రానికి చేరుకోనుంది.

సోమవారం.. కొవిడ్ చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్ సహా... కొన్ని కంటైన్మెంట్ జోన్లు, టెస్టింగ్ ప్రక్రియను సైతం పరిశీలించనున్నట్టు సమాచారం. అనంతరం నివేదికను బృంద సభ్యులు కేంద్రానికి నివేదించనున్నారు.

ఇవీచూడండి: తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.