Punganuru breed cow: ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు జాతి ఆవుకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు జాతికి ఆవులకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆవులను ప్రపంచంలోనే ఎత్తైనవిగా పేరుగాంచాయి.
ఈ జాతి ఆవులు రెండు అడుగుల ఎత్తుతో పాటు దాదాపు 200 కిలోల బరువు ఉంటాయి. ఇవీ రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల వరకు0 పాలు ఇస్తాయి. తిరుమలలో స్వామి వారికి పుంగనూరు జాతి ఆవు పాల నుంచి వచ్చే నెయ్యిని వినియోగిస్తారు. అందువల్లనే పుంగనూరు జాతి ఆవును పెంచేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాతి ఆవు సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.63 కోట్లతో ఇప్పటికే మిషన్ పుంగనూరు రీసెర్చ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. పుంగనూరు జాతి ఆవు పేరుతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: