దేశీయ మొబైల్ కంపెనీ సెల్కాన్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా... టెక్నాలజికల్ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో... పది రకాల హెల్త్‌కేర్ ఉత్పత్తులను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ విడుదల చేశారు. కరోనా సంక్షోభంలో సానిటైజేషన్ తప్పనిసరి అయినందున... టచ్ రహిత హ్యాండ్ శానిటైజర్ మెషిన్లు, డిస్ ఇన్ఫెక్టివ్ గన్లు, థర్మల్ స్కానర్లను తీసుకువస్తున్నామని కంపెనీ ప్రకటించింది.
సెన్సర్ల సహాయంతో రూపొందించిన ఈ ఉత్పత్తులు పూర్తిగా మేక్ ఇన్ తెలంగాణలో తయారు చేయటం అభినందనీయమని జయేష్ రంజన్ అన్నారు. ఇవాళ్టి నుంచి తమ ఉత్పత్తులు దక్షిణాదిలోని అన్ని మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, మొబైల్ రిటెయిల్ అవుట్ లెట్లలో దొరుకతాయని... మరో పదిహేను రోజుల్లో పాన్ ఇండియా సేల్స్ జరపనున్నట్టు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా