ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తోంది. మూడ్రోజుల కిందట దస్తగిరిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. అతడిని దిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అటు.. పులివెందులలో దస్తగిరి తల్లిదండ్రులు హాజీవలి, మస్తానమ్మను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది. హాజీవలిని సీబీఐ అధికారులు అనంతపురం జిల్లా కదిరికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఓ దుకాణం నిర్వహిస్తున్నందున పరిశీలించేందుకు వెళ్లినట్లు తెలిసింది. కూలీపని చేసుకుని జీవనం సాగించే తమ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధిస్తున్నారని దస్తగిరి తల్లి కంటతడిపెట్టింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: వీహెచ్