ETV Bharat / city

ప్రజారాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారు: చంద్రబాబు

ప్రజారాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందని తెలిపారు. రాజధాని విషయంలో వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన మండిపడ్డారు.

chandrababu on amaravati
chandrababu
author img

By

Published : Mar 3, 2022, 8:41 PM IST

ప్రజారాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారు: చంద్రబాబు

ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే విషయం మరోసారి రుజువైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా రాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారన్నారు. విజయం సాధించిన అమరావతి ప్రజలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

అమరావతి ప్రజలు ప్రపంచంలోనే అత్యధిక భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఎలాంటి వివాదం లేకుండా 33 వేల ఎకరాల భూమి ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. భారీ వరదల్లోనూ ఒక్క ప్రాంతం కూడా ముంపునకు గురికాలేదన్నారు. ఎంతో ముందుచూపుతో పకడ్బందీగా సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకువచ్చానని వెల్లడించారు. రాజధాని విషయంలో వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు మండిపడ్డారు. మీ రాజధాని ఏదని అడిగితే మన పిల్లలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 రోజులుగా ధర్నా చేస్తున్నా రైతులకు సమాధానం చెప్పలేదన్నారు. మహిళా రైతులపై విచక్షణరహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధే నా కులం..

తనకు కులమంటే తెలియదని.. ప్రజలు, అభివృద్ధే తన కులమని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ను ప్రజల కోసమే అభివృద్ధి చేశానని అన్నారు. తాను ఆలోచించిన ఔటర్‌రింగ్‌ రోడ్డు వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు. అమరావతి చుట్టూ కూడా 187 కి.మీ. రింగ్‌రోడ్డుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. రింగ్‌రోడ్డు లోపల ప్రపంచస్థాయిలో 9 నగరాలు నిర్మించాలని భావించానన్నారు. రాజధాని భూములు కుదువపెట్టి రుణాలు తెచ్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు రూ.100 ఖర్చుపెడితే ప్రభుత్వానికే రూ.30 చేరుతుందని అన్నారు.

"ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది. వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రజా రాజధానిని అమరావతి ప్రజలు కాపాడుకున్నారు. మీ రాజధాని ఏదని అడిగితే చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు. నాకు కులమంటే తెలియదు. ప్రజలు, అభివృద్ధే నా కులం. రాజధాని భూములు తనఖాపెట్టి రుణాలు తెచ్చుకోవాలని చూస్తున్నారు."

-చంద్రబాబు

వివేకా హత్య నాటకాలు..

వివేకా హత్యపై జగన్‌ ఎన్నో నాటకాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. సొంత బాబాయిని చంపితే రెండు లాభాలు వస్తాయని భావించారని విమర్శించారు. వివేకా, అవినాష్‌రెడ్డి తన రెండు కళ్లు అని చక్కగా చెప్పారని దుయ్యబట్టారు. వివేకాను అడ్డు తొలగించుకుని, తనపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందారన్నారు. బాబాయి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆక్షేపించారు. కోడి కత్తి, బాబాయి హత్యతో రెండు నాటకాలు గొప్పగా ఆడారన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయొచ్చని ధీమాగా ఉన్నారన్నారు.

"వివేకా హత్యపై జగన్‌ ఎన్నో నాటకాలు ఆడారు. జగన్‌రెడ్డి మామ ఆస్పత్రి నుంచి వైద్యులను నేను తీసుకువచ్చానా ?. గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి నా మనుషులా ?. వివేకాను అడ్డు తొలగించుకుని, నాపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందారు. కోడి కత్తి, బాబాయి హత్యతో రెండు నాటకాలు గొప్పగా ఆడారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయొచ్చని ధీమాగా ఉన్నారు. బాబాయి హత్య ఇవాళ అడ్డం తిరిగింది. శిశుపాలుడి పాపాల వలే జగన్‌ పాపాలు కూడా పండుతాయి. సీబీఐ విచారణ వేస్తే అవినాష్‌రెడ్డి భాజపాలోకి వెళ్తారని జగన్ అన్నారా లేదా?. హత్యా రాజకీయాలు చేసిన వాళ్లు పాలించేందుకు అనర్హులు."

- చంద్రబాబు

ఒక్క అవకాశం అని ఇస్తే..

ఒక్క అవకాశం అని ఇస్తే.. ఇప్పటికే చాలా నష్టం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ఏపీకి ఒక వరం లాంటిదన్నారు. పోలవరంలో 70 శాతం పనులు తెదేపా ప్రభుత్వమే పూర్తి చేసిందని తెలిపారు. ఇన్నేళ్లలో పోలవరం పనుల్లో రూపాయి అవినీతిని నిరూపించారా ? అని ప్రశ్నించారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఆక్షేపించారు. దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానం చేసిన ఘనత తమదేని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుని కలిసిన అమరావతి రైతులు

రాజధాని అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించటంతో అమరావతి మహిళా రైతులు తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుని కలిశారు. తమ పోరాటంలో అండగా నిలిచారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ పెట్టిన క్షోభ మరెవరికీ రాకూడదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన అన్యాయంపై ఊరురా తిరిగి ప్రచారం చేస్తామని రైతులు వెల్లడించారు.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.