ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పరిధిలో కేంద్ర వ్యవసాయశాఖలో మొక్కల సంరక్షణ అధికారిగా పని చేస్తున్న ఆర్.పదంసింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు లంచాలు దండుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో సీబీఐ నిఘా పెట్టింది. ఈ క్రమంలో పదంసింగ్ విశాఖలోని కార్యాలయంలోనే రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా.. సీబీఐ పట్టుకుంది.
విశాఖ, కాకినాడతో పాటు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోనూ అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో రూ.1.86 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పదంసింగ్‌తో పాటు మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది.
ఇవీ చూడండి..
ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపయ్యిందో చెప్పాలి: కేటీఆర్
అఖిలపక్ష నేతలతో ఓంబిర్లా భేటీ.. వాటిపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్