ETV Bharat / city

YS VIVEKA CASE: వివేకా హత్య కేసులో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ

ఏపీలో జరిగిన వైఎస్ వివేకా హత్య కేసులో కడప సబ్ కోర్టులో దస్తగిరి తరఫున సీబీఐ... అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది. 306 సెక్షన్ కింద దస్తగిరి సాక్ష్యం రికార్డు చేయాలని కోరింది.

YS VIVEKA CASE
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ
author img

By

Published : Nov 11, 2021, 10:53 PM IST

వైఎస్ వివేకా హత్య కేసులో కడప సబ్ కోర్టులో దస్తగిరి తరఫున సీబీఐ... అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది. ఐపీసీ 306 సెక్షన్ కింద దస్తగిరి సాక్ష్యం రికార్డు చేయాలని కోరింది. పిటిషన్​పై ఇరువైపులా న్యాయమూర్తి వాదనలు విన్నారు. నిందితుల తరఫు న్యాయవాదులు దస్తగిరి వాంగ్మూలం వివరాలను ఇవ్వాలని కోరారు. ఈ నెల 17లోపు పత్రాలు ఇవ్వాలని సీబీఐకి.. న్యాయస్థానం సూచించింది. వివేకా హత్య కేసు ప్రాథమిక ఛార్జిషీట్​లో సీబీఐ ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను చేర్చింది.

ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. ఆ నలుగురి ప్రమేయంపై పులివెందుల న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసింది.

అంతమొందించేందుకు ప్రణాళిక

గజ్జల ఉమాశంకర్‌రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డి సోదరుడు ఉమాశంకర్‌రెడ్డి. ఈయనది కడప జిల్లా సుంకేశుల. పాల డెయిరీ నిర్వహిస్తుంటారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ను వివేకాకు పరిచయం చేసింది ఈయనే.

సీబీఐ ఏం తేల్చిందంటే: వివేకాను అంతమొందించేందుకు సునీల్‌తో కలిసి ప్రణాళిక రూపొందించారు. ఇంటి వద్ద ఉండే కుక్కను ఉమాశంకర్‌రెడ్డి కారుతో గుద్దించి చంపేశారు. సేకరించిన శాస్త్రీయ ఆధారాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ డైరెక్టరేట్‌తోపాటు మరికొన్ని ప్రయోగశాలల్లో విశ్లేషించగా... ఈ హత్యలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర తేటతెల్లమైంది. హత్యలో శంకర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సునీల్‌ యాదవ్‌, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.

గొడ్డలిని బైక్‌ సైడ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టి

యాదటి సునీల్‌ యాదవ్‌: ఈయనది పులివెందుల మండలం మోట్నూంతలపల్లె. వివేకా హత్యకు కొన్ని రోజుల ముందే ఆయనకు పరిచయమయ్యారు.

సీబీఐ దర్యాప్తు ఏం తేల్చిందంటే: ఉమాశంకర్‌రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందించారు. వివేకాను హత్య చేసిన రోజు రాత్రి ఆయన ఇంటికి చేరుకునేందుకు ఉమాశంకర్‌రెడ్డికి చెందిన పల్సర్‌ బైక్‌నే సునీల్‌ వినియోగించారు. గొడ్డలిని బైక్‌ సైడ్‌ బ్యాగ్‌లో దాచిపెట్టి, దానిపైనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోనూ హత్యలో సునీల్‌ ప్రమేయం గురించి వెల్లడించారు. హత్యకు వినియోగించిన ఆయుధాలు, ఇతర నిందితుల ప్రమేయం గురించి సునీల్‌కు తెలుసు.

ఆధారాలను తుడిచేశారని...

తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఈయన పేరు రెండోది.

ఆరోపణలు, అభియోగాలు: ‘‘వివేకా హత్య కేసు విషయంలో ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరికేస్తా’’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారంటూ వివేకా వద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న ఈ ఏడాది జులైలో ఆరోపించారు. ‘‘వివేకా హత్య తర్వాత ఘటనా స్థలంలోని రక్తపు మరకలు, ఇతర ఆధారాలన్నింటినీ తుడిచేశారు. మనోహర్‌రెడ్డి చెబితేనే ఆధారాల్ని తుడిచేశానని ఆయన గతంలో కస్టడీలో ఉన్నప్పుడు చెప్పారు. వివేకా మరణించారనే విషయం మా తల్లికి, నాకు కానీ ఫోన్‌ చేసి చెప్పలేదు. మేము లేకుండానే అంత్యక్రియలు జరిపించేందుకు ప్రయత్నించారు. గాయాల ఆనవాళ్లు కనిపించినప్పటికీ గుండెపోటుతో మరణించారంటూ చిత్రీకరించి నమ్మించేందుకు యత్నించారు.’’ అంటూ వివేకా కుమార్తె సునీత ఈయనపై అనుమానాలు వ్యక్తం చేశారు.

దిల్లీలో రెండు నెలలపాటు విచారణ

షేక్‌ దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018ల్లో డ్రైవర్‌గా పనిచేశారు. హత్యకు 6నెలల ముందు మానేశారు. ఇతని ప్రమేయానికి సంబంధించి వాచ్‌మన్‌ రంగన్న వాంగ్మూలం ఇవ్వగా... ఉమాశంకర్‌రెడ్డి ప్రమేయంపై ఈయన సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. 2 నెలలపాటు ఆయన్ను సీబీఐ అధికారులు దిల్లీ విచారించారు.

ఇదీ చదవండి:

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.