రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులకు వైద్యారోగ్యశాఖ నుంచి పిలుపొచ్చింది. జూనియర్ వైద్యుల సంఘాన్ని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ... చర్చలకు ఆహ్వానించారు. అందుకు సుముఖత వ్యక్తం చేసిన జూడాలు... బీఆర్‌కే భవన్‌లో రిజ్వీని కలవనున్నారు. జూడాల తరఫున ఐదుగురు సభ్యులు చర్చల్లో పాల్గొననున్నారు.
రిజ్వీతో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జూడాలు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరవేరటమే లక్ష్యంగా జూడాలు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించిన జూడాలు... నేడు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేశారు.