రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు ప్రతిపాదించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.1,500 కోట్లు కేటాయించామని చెప్పారు.
2013-14 ఐటీ ఎగుమతులు విలువ రూ.50 వేల కోట్లగా ఉంటే.. 2018-19లో ఐటీ రూ.లక్షా 9 వేల కోట్లకు పెరగడం పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా ఐటీని విస్తరిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..