పీజీ పరీక్షలు డిసెంబరు 15 నుంచి జనవరి వరకు నిర్వహించేలా బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ పీజీ కోర్సులతో పాటు.. బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు డిసెంబరు 15 నుంచి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఈనెల 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరీక్షకు రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అధ్యయన కేంద్రం, వెబ్ సైట్, హెల్ప్‌డెస్క్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చునన్నారు.