సకల జనులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని... భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తోందని మండిపడ్డారు. ఒక్కో వర్గాన్ని... ఒక్కో విధంగా మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటైందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులను, ఆత్మగౌరవ భవనాల పేరుతో ఇతర వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత కక్షలతోనే పరిపాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఇటీవల కాలంలో భాజపా నాయకులుపై దాడులు, అక్రమ కేసులు పెడుతూ... పోలీసులతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండాలో లాఠీఛార్జీ ఘటనపై... ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలవనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: గుర్రంబోడు తండా వివాదాస్పద భూముల వెనుక కథేంటంటే?