ETV Bharat / city

బూర నర్సయ్య ఇంటికి వెళ్లిన బండి సంజయ్.. పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ - బూర నర్సయ్యతో సమావేశమైన బండి సంజయ్

Bandi Sanjay Meets Boora Narasaiah: తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా మారితే... భాజపా ఉద్యమకారులతో నిండిపోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇటీవల తెరాస సభ్యత్వానికి రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్‌ ఇంటికి వెళ్లికి భాజపాలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 19న దిల్లీలో భాజపాలో చేరుతున్నట్లు బూరనర్సయ్య గౌడ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలవబోదని ఆయన పేర్కొన్నారు.

Bandi Sanjay Meets Boora Narasaiah
Bandi Sanjay Meets Boora Narasaiah
author img

By

Published : Oct 17, 2022, 1:54 PM IST

Bandi Sanjay Meets Boora Narasaiah: రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ భాజపాలో చేరుతున్నారని ఆ పార్టీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా మారితే... భాజపా ఉద్యమకారులతో నిండిపోతోందని పేర్కొన్నారు. ఇటీవల తెరాస సభ్యత్వానికి రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్‌ ఇంటికి వెళ్లి భాజపాలోకి రావాలని ఆహ్వానించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం నర్సయ్య గౌడ్ ఎంతో కష్టపడ్డారని బండి సంజయ్ తెలిపారు.

ఈ నెల 19న దిల్లీలో భాజపాలో చేరుతున్నట్లు బూరనర్సయ్య గౌడ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలవబోదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను కలవడం తెరాస నేతలకు ఉద్యమంలా మారిందని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే భాజపాలో చేరుతున్నానని తెలిపారు. దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో చేరిక ఉంటుందని వ్యాఖ్యానించారు.

'రాష్ట్ర భవిష్యత్ కోసమే నర్సయ్య భాజపాలో చేరుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టత ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదు. నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో భాజపా గెలుపు ఖాయం. నర్సయ్య గౌడ్‌ను మోదీ గుర్తించారు, కేసీఆర్ దగ్గరికి కూడా తీసుకోలేదు. మునుగోడులో ఒక గ్రామానికి సీఎంను ఇన్‌ఛార్జిగా పెట్టిన ఘనత భాజపాది'- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఈ నెలాఖరున 27 లేదా 28న హైదరాబాద్​ శివారులో భాజపా బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించనుంది. ఆ సభలో బూర నర్సయ్య వర్గీయులు కమలం పార్టీలో చేరనున్నారు. ఆ సభకు పార్టీ ముఖ్య నేత హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెరాసకు రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్... అందుకు గల కారణాలపై మఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. తాను తెరాస నుంచి వెళ్లలేదని.. ముఖ్యమంత్రి కేసీఆరే వద్దనుకుని అవమానించి పార్టీ నుంచి పంపించారేమోనని బూర నర్సయ్య గౌడ్‌ లేఖలో ఆరోపించారు.

ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకపోతే.. పార్టీలో ఉండటం వృథా అని రాజీనామా చేసినట్లు తెలిపారు. అభిమానానికి.. బానిసత్వానికి తేడా ఉంటుందన్న ఆయన.. రాజకీయ వెట్టిచాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని లేఖలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బూర నర్సయ్య పోటీ చేస్తారని... ఈ మేరకు భాజపా అధిష్ఠానం నుంచి హామీ లభించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెరాస మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంశంపైనా కూడా తెరాసలో చర్చ జరుగుతోంది.

బూర నర్సయ్య ఇంటికి వెళ్లిన బండి సంజయ్.. పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.