ఏబీవీపీ నాయకులపై లాఠీఛార్జ్‌ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగానికి అతి తక్కువ నిధుల కేటాయించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునిస్తే లాఠీలు జులిపిస్తారా అని మండిపడ్డారు. ఈ లాఠీఛార్జ్‌లో 100 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని... 200 లకు పైగా అరెస్ట్ అయ్యారని తెలిపారు.
విద్యార్థులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష్య సాధింపు చర్యలకు స్వస్తి పలకాలని, వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఒక ప్రకటనలో లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం