ETV Bharat / city

భాజపా ప్రణాళికలు: బహిరంగ ప్రచారం.. రహస్య మంతనాలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా... భాజపా తమ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. వినూత్న ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తామని కమలనాథులు చెబుతున్నారు. కేంద్ర మంత్రులతోపాటు జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. ఒక వైపు ప్రచార వ్యూహాలు రచిస్తూనే... మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేశారు. మిషన్ 75 లక్ష్యంగా ఎన్నికల ప్రచార సరళి ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆయా డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

bjp plan for ghmc election campaining
భాజపా ప్రణాళికలు: బహిరంగ ప్రచారం.. రహాస్య మంతనాలు
author img

By

Published : Nov 22, 2020, 5:42 AM IST

Updated : Nov 22, 2020, 7:24 AM IST

అభ్యర్థుల ఎంపికపై ప్రధాన దృష్టి సారించిన భాజపా... నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే... ప్రచారాన్ని హోరెత్తించనుంది. గత ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై భాజపా ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్... రాష్ట్ర భాజపా నేతలతో కలిసి ఛార్జీషీట్‌ను విడుదల చేయనున్నారు. భాగ్యనగర ప్రజలు మెచ్చేలా భాజపా ఎన్నికల ప్రణాళిక ఉంటుందన్న నేతలు... ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

రంగంలోకి జాతీయ నేతలు

రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలతో ప్రచారం సాగిస్తామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాష్ జవడేకర్, ఫడణవీస్‌, ఖుష్బూ, దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, భుపేంద్ర యాదవ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన భాజపా సీనియర్‌ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. బీ-ఫాం దక్కని వాళ్లు పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేస్తే శాశ్వతంగా బహిష్కరిస్తామని కమలదళపతి స్పష్టం చేశారు.

చేరికలపై దృష్టి..

ఓ వైపు ప్రచార వ్యూహాలు రచిస్తూనే... మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్‌ను భాజపా ముమ్మరం చేసింది. ఇటీవల కాంగ్రెస్, తెరాసకు చెందిన పలువురు భాజపాలో చేరగా... మరికొంత మంది కీలక నేతలకు గాలం వేస్తున్నారు. శాసనమండలి మాజీ చైర్మన్, తెరాస నేత స్వామిగౌడ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ అయి భాజపాలోకి ఆహ్వానించారు. భాజపా నేతల ఆహ్వానం పట్ల స్వామి గౌడ్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని మరోసారి భాజపా నేతలు కలిసినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని భాజపా వర్గాలు తెలిపాయి. వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కమలనాథులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీలు

Last Updated : Nov 22, 2020, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.