మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని జీకే ప్రైడ్ వద్ద రోడ్ల పరిస్థితిని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ అధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి పరిశీలించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే రోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. జవహర్‌నగర్‌లోని రోడ్ల పరిస్థితి తెరాస నాయకులు గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే రోడ్డుపై ప్రయాణిస్తూ ఎంతో మంది ప్రమాదాలు బారిన పడ్డారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఇదే విషయమై ఉన్నతాధికారులను కలిసిన భాజపా నేతలు.. రోడ్డు సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నూతన రోడ్డును నిర్మించి ప్రయాణికుల కష్టాలు తీర్చాలన్నారు. సమస్యపై అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.