ETV Bharat / city

'ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో ఆ చట్టం తీసుకురావాలి' - ఆయుష్మాన్​ భారత్​ను అమలుచేయండి

తెలంగాణలోనూ ఆయుష్మాన్​ భారత్​ పథకాన్ని అమలు చేయాలని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ కోరారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

raja singh
తెలంగాణలో ఆయుష్మాన్​ భారత్​ను అమలుచేయండి: రాజాసింగ్​
author img

By

Published : Mar 15, 2020, 7:00 PM IST

ఆయుష్మాన్​ భారత్​ను తెలంగాణలోనూ అమలు చేయాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు పేదల జేబులు గుల్లచేస్తున్నాయన్న రాజాసింగ్​.. ప్రైవేటు దవాఖానాలో చేరిన రోగులు మరణిస్తే పైసా కూడా చెల్లించకుండా బాధితుల ఇంటివద్దకే మృతదేహం చేరేలా చట్టం తీసుకురావాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యల కారణంగా ప్రైవేటు సంస్థల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తున్నారని రాజాసింగ్​ అన్నారు. ప్రైవేటు సంస్థల్లోని ఫీజులపై సర్కారు దృష్టిసారించాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

చాలా ప్రాంతాల్లో రహదారులు, నాళాలు సరిగా లేవని సంబంధిత మంత్రి దృష్టిసారించాలని కోరారు. మూగజీవాల ఆక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.

తెలంగాణలో ఆయుష్మాన్​ భారత్​ను అమలుచేయండి: రాజాసింగ్​

ఇవీచూడండి: రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు నష్టపోతున్నారు: కేంద్ర మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.