హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర భాజపా కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసిన శ్రీనివాస్... తొందరగా కోలుకోవాలని లిబర్టీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి ఆధ్వర్యంలో... ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు.
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను చూసి మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశాడని చింతల తెలిపారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. భాజపా నాయకులపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు అసత్యమంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే అవకాశం లేకుండా పోయిందని... తమ నాయకులను ముందస్తు హౌస్ అరెస్టులు చేసి... తెరాస ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం