ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ, వివాదాస్పద పరిణామాలు చాలా బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలపట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం సరికాదని ఓ ప్రకటనలో హితవు పలికారు. సమాజంలో అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు.. సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తూ మాట్లాడటం మంచిదికాదని బండి చెప్పారు.
ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిపై కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు. అంతర్వేదిలో రథం కాలిపోతే... చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా హిందూ సమాజం స్పందిస్తున్నా... అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేసి, చర్యలు తీసుకోవాల్సిన నేతలు... మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు.
ఇదీ చదవండిః రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు