విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. అధికారులతో వివరణ ఇప్పించడం వెనుక అంతర్యమేంటన్న లక్ష్మణ్.. వారిని బలి పశువులను చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతకానితనంతోనే విద్యుత్ సంస్థలు రూ.20 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని ఆరోపించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. ప్రజాకోర్టులో సీఎం కేసీఆర్‌ను దోషిగా నిలబెడతామన్నారు. అవినీతిలో తెరాస ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోని అన్నిరంగాల్లో అవినీతిని వెలికి తీస్తామని, న్యాయపోరాటం చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర ట్వీట్