17వ బయో ఆసియా సదస్సు విజయవంతంగా ముగిసిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మూడు రోజులపాటు కొనసాగిన సదస్సులో పలు మేధోప్యానల్ చర్చలు, అవగాహన ఒప్పందాలు, పెట్టుబడుల ఆకర్షణతో ముగిసింది. 37 దేశాల నుంచి 2వేల మందికి పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. టుడే ఫర్ టుమారో(రేపటి కోసం నేడు) అన్న థీమ్‌తో నిర్వహించిన ఈ సదస్సులో.. పాలసీ ఇంటర్వెన్షలపై విస్తృతంగా చర్చించారు.
మూడురోజుల సదస్సులో సిజీన్ రిసెర్చ్ ఫెసిలిటీ, మెడ్ టెక్ పార్కులో 5 ఫార్మా కంపెనీలకు భూకేటాయింపు జరిగింది. నోవార్టిస్ బయోమ్ సెంటర్, సయాంట్-ఎల్వీ ప్రసాద్ మధ్య ఏఐ విభాగంలో ఎంవోయూ, ఎపిడమిక్ సెంటర్ ఏర్పాటు వంటి ఒప్పందాలు జరిగాయని బయో ఆసియా సీఈవో శక్తినాగప్పన్ తెలిపారు.
సదస్సులో భాగంగా 70కి పైగా స్టార్టప్‌లు తమ హెల్త్ కేర్ ఉత్పత్తులు, లైఫ్ సైన్సెస్ రంగంలో సవాళ్లకు పరిష్కారాలతో ఇన్నోవేషన్ షోలను నిర్వహించారు. వీటిలో ఐదు ఉత్తమ స్టార్టప్‌లను బయో ఆసియా జ్యూరీ ఎంపిక చేసి మంత్రి నగదు బహుమతి ప్రకటించారు. ముగింపు సమావేశంలో కేటీఆర్ విజేతలకు అందజేశారు. బయో ఆసియా సదస్సు ఉత్తమైమన ఫలితాలలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తోందని మంత్రి కితాబిచ్చారు. వచ్చే ఏడాది మరింత విస్తృతంగా, విజయవంతంగా సదస్సు నిర్వహించుకుందామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి