ETV Bharat / city

బయోఆసియా సమావేశం.. జీవశాస్త్రాల పురోగతికి ఔషధం - bio asia-2021 meeting updates

హైదరాబాద్ వేదికగా జీవశాస్త్రంలో అతిపెద్ద సదస్సు బయో ఆసియా - 2021 జరగనుంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సు.. ఈసారి కోవిడ్ నేపథ్యంలో వర్చువల్గా నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్న బయో ఆసియా సదస్సులో ఆరోగ్యరంగానికి కోవిడ్ విసిరిన సవాళ్లు.. హెల్త్ కేర్లో టెక్నాలజీ అవకాశాలపై విస్తృత చర్చ చేపట్టనున్నారు.

bio asia-2021 meeting starts from today
bio asia-2021 meeting starts from today
author img

By

Published : Feb 22, 2021, 4:25 AM IST

Updated : Feb 22, 2021, 6:47 AM IST

హైదరాబాద్లో ప్రతి ఏటా జరిగే బయోఆసియా సదస్సును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏటా జీవశాస్త్ర రంగంలో అత్యుత్తమ సేవలందించేవారికి పురస్కారాలు అందించనున్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా జీవ అధ్యయన పరిశోధన సంస్థ సంచాలకుడు పీటర్​ మార్క్స్​ కీలకోపాన్యాసం చేయనున్నారు.

పలు దేశాల నుంచి నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ సదస్సులో.. కోవిడ్ నేపథ్యంలో ఈసారి వర్చువల్గా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈసారి 18వ ఎడిషన్ సదస్సు "మూవ్ ద నీడిల్" అనే థీమ్​పై నిర్వహించనున్నారు. ఈసారి సదస్సు ప్రధానంగా కోవిడ్ విసిరిన సవాళ్లు, లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకొవచ్చిన మార్పులు, ఇమ్యునైజేషన్లో భారత పాత్ర వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో రెండోరోజు మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్ల, ప్రపంచ ఆరోగ్య సంస్థ సీఎస్​ఓ డా. సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్, గేట్స్ ఫౌండేషన్, సెపి, ఎఫ్​డీఏ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి గ్లోబల్లీడర్లు పాల్గొననున్నారు. రెండోరోజు జరగబోయే చర్చలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి కేటీఆర్​ సాంకేతిక అవకాశాలపై చర్చించనున్నారు.

ఇదీ చూడండి: విధివంచితుల విషాదగాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ

Last Updated : Feb 22, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.