ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రోజు వారంలో రైతులకు శుభవార్త చెబుతానని ఇంతవరకు చెప్పలేదని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి లేఖ రాశారు. గతంలోనూ అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు.
వెంటనే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే... ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కురుస్తున్న వర్షాలతోనే చెరువులు నిండాయి తప్ప కేసీఆర్ గొప్పతనమేమీ లేదని ఎద్దేవా చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరందలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో కమిషన్లు దండుకున్న కేసీఆర్... కాంగ్రెస్ హయాంలో 90శాతం పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ, బ్రహ్మణ వెల్లంల, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను విస్మరించారని మండిపడ్డారు.
ఇదీ చదవండిః కొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే