జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఈ పురస్కారం ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌కు దక్కినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకాలు రావాలని అన్నారు. 65 శాతం వ్యాక్సిన్లు భాగ్యనగరం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. అతిపెద్ద తయారీ హబ్‌గా ఈ నగరం సత్తా చాటుతోందని చెప్పారు. జినోమ్ వ్యాలీ ప్రపంచంలోనే బెస్ట్ హబ్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా 2021 సదస్సులో జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి ఏటా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది.. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల ఈ పురస్కారాలు అందుకున్నారు.