ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైల్లో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఒకే రోజు 3 లక్షల 80 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు మెట్రో చేర్చింది. ఇవాళ్టి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కావడం వల్ల ఈరోజు రద్దీ మరింత పెరిగింది. ఉదయం నుంచే కార్యాలయాలకు... విద్యా సంస్థలకు వెళ్లే వారితో మెట్రో రైల్లు రద్దీగా మారాయి. భద్రత కారణాల వల్ల బేగంపేట మెట్రో స్టేషన్ ముసివేసిన అధికారులు అనంతరం 9.20 నిమిషాలకు తిరిగి పునరుద్ధరించారు. గత రికార్డును దాటి మరో కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
బేగంపేట మెట్రోస్టేషన్ మూసివేత... ఎందుకంటే? - hyderabad metro latest news
హైదరాబాద్లోని బేగంపేట మెట్రో స్టేషన్ను అధికారులు మూసివేశారు. భద్రత కారణాల వల్ల మూసివేసి 9.20 గంటలకు తిరిగి పునరుద్ధరించారు.