బీసీ జాబితాలో కొత్తగా కులాలను చేర్చే ఆలోచనను రాష్ట్రప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అన్నారు. బీసీలో కొత్తకులాలను చేర్చవద్దంటూ తెలంగాణ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. బీసీ కులాల జాబితాలో కొత్తగా 18 కులాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
56 శాతం ఉన్న బీసీలకు గతంలో 34 శాతం రిజర్వేషన్ ఉంటే వాటిని స్థానిక ఎన్నికలలో తెరాస ప్రభుత్వం 23 శాతానికి తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో కొత్తవాటిని చేర్చాలని చూస్తే బీసీలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి