నిజామాబాద్ జిల్లా సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్ రయనుద్దీన్(19) శంకర్‌పల్లిలోని ఓ విద్యాసంస్థలో బీబీఏ కోర్సు చదువుతూ వసతిగృహంలో ఉంటున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థినితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాడు. తొలినాళ్లలో ఆమె తిరస్కరించింది. పదేపదే తనతో స్నేహం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే చంపేస్తానని బెదిరించడం వల్ల బాధితురాలు అంగీకరించింది. ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నాడు. ఇదే అదనుగా తాను చెప్పినట్లుగా ఉండాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అందుకు అంగీకరించకపోతే సెల్ఫీ చిత్రాలను ఆమె తల్లిదండ్రులకు పంపిస్తానంటూ హెచ్చరించడం వల్ల... బాధితురాలు మిన్నకుండిపోయింది.
మరింత రెచ్చిపోయిన మహ్మద్... ఓరోజు ఆమెకు ఫోన్ చేసి స్వీయ నగ్నచిత్రాలను వాట్సాప్‌లో తనకు పంపించాలంటూ డిమాండ్ చేశాడు. చివరకు ఒత్తిడికి తలొగ్గి అతడి కోరిక నెరవేర్చింది. ఆ చిత్రాలు తన చేతికి చిక్కేసరికి వేధింపులు మరింత పెంచాడు. తట్టుకోలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ కె.ఎం.విజయ్‌కుమార్ నిందితుడిని అరెస్ట్ చేశారు. రయనుద్దీన్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చూడండి : సంకల్పం ముందు అంగవైకల్యం బలాదూర్...