ఉగాండా రాజధాని కంపాలాలో తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రాంతాలకతీతంగా మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలాటాలు ఆడారు. అనంతరం పక్కనే ఉన్న కొలనులో బతుకమ్మలు నిమజ్జనం చేసి పోయిరావమ్మా... బతుకమ్మ అని పాడుతూ వీడ్కోలు పలికారు. అత్యంత అద్భుతంగా జరిగిన ఈ వేడుకలకు పాశ్చాత్యులు ముగ్ధులయ్యారు. మున్ముందు జరిగే ప్రతి సంబురంలో తాముకూడా భాగస్వాములవుతామని తెలిపారు.
- ఇదీ చూడండి : దేవరగట్టులో నెత్తురోడింది!