Collector Couple In Paddy Fields: జిల్లా కలెక్టర్ అంటే ఎప్పుడు బిజీబిజీగా ఉంటారని తెలుసు. అధికారులకో చర్చలు, ఎవరైనా పైఅధికారులు వచ్చినప్పుడు వారికి బందోబస్తు, ఏర్పాట్లు ఇలా తీరికలేకుండా గడుపుతుంటారు. అదే ఒకే ఇంట్లో భార్య భర్తలిద్దరు కలెక్టర్లు ఉంటే వారికి మాట్లాడుకోవడానికి క్షణం తీరిక ఉండదు. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే సినిమాలు, షికార్లకు పోయి అలసట తీర్చుకుంటారు.
కానీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేశ్‌కుమార్, విజయకృష్ణన్‌లు మాత్రం తీరిక దొరికితే మహర్షి సినిమాని ఫాలో అవుతారు. అదేనండీ వీకెండ్ ఫార్మింగ్. ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వచ్చి కూలీలతో కలిసి నాట్లు వేయడం, వారితో కలిసి భోజనం చేయడం లాంటివి చేస్తారు. బాపట్ల జిల్లా మురుకొండపాడు సమీపంలోని వ్యవసాయ కూలీలతోపాటు ఈ కలెక్టర్లు వరినాట్లు వేశారు.
కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి కలెక్టర్ దంపతులు వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్టుపై కూర్చుని భోజనం చేశారు. తీరిక సమయాల్లో పొలంలో పని చేస్తూ గట్టుపై కూర్చుని భోజనం చేయటం తమకెంతో ఇష్టమని వారు తెలిపారు.
ఇవీ చదవండి: శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు
137 ఏళ్లలో మూడు సార్లే అధ్యక్ష ఎన్నికలు.. ఈసారి సరికొత్త లెక్క.. పార్టీ పరిస్థితి మారేనా?