Bandi Sanjay Letter to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని.. ఈ సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని లేఖలో వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ రిక్రూట్బోర్టు నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను సవరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: