కేంద్ర మంత్రి సురేష్ అంగడి మరణం దేశానికి, భాజపాకు, కర్ణాటక రాష్ట్రానికి తీరని లోటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సురేష్ అంగడి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారన్నారు. ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా, నిండు హృదయంతో పలకరించే వ్యక్తని గుర్తుచేసుకున్నారు. మోదీకి అండగా ఉంటూ, దేశం అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో ఉండేవారన్నారు. తనకు వ్యక్తిగతంగా.. సహకరించే వారని.. ఎంతో ప్రోత్సహించే వారని.. ఈ సమయంలో ఆయన లేకపోవడం కలిచివేసిందని బండి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ బుధవారం కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు.
ఇవీచూడండి: కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత