ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల పిల్లలు బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేనందున వారు ఫిట్‌నెస్‌కు దూరమవుతున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ తార పీవీ సింధు అన్నారు. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకుడు, బ్యాడ్మింటన్ కోచ్ శ్రీకాంత్ రూపొందించిన ఆన్లైన్ ఫిట్కిడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కరోనా కాలంలో పిల్లల కోసం ఆన్లైన్ ఫిట్నెస్ అంశాలను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని సింధు అన్నారు. ఒకటో గ్రేడ్ నుంచి 12వ గ్రేడ్ విద్యార్థులకు ఫిట్నెస్ అంశాలను రూపొందించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భౌతిక దూరంతోపాటు శారీరక వ్యాయామమూ ముఖ్యమని వెల్లడించారు.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు