గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్ నర్సింహ గౌడ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ రైతుబజార్, మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో వినియోగదారులకు అవగాహన కల్పించారు. వినియోగదారులకు మార్కెట్ గేట్ వద్ద మాస్కులు అందజేశారు. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే మార్కెట్‌లోనికి అనుమతిస్తున్నారు. కూరగాయల ధరలు సాధారణంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.
మార్కెట్ పరిసరాల్లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పర్యటించి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మహమ్మారుల గుణపాఠం.. మానవతే కీలకమంటున్న గతం