తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని భాజపా యువ మోర్చా ముట్టడించేందుకు యత్నించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ డిమాండ్ చేశారు.
భాజపా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వైపుకు ఒక్కసారిగా దూసుకువచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: సాయంత్రం కొవాగ్జిన్ టీకా తరలింపు ప్రక్రియ