ETV Bharat / city

ATTACK: జనసైనికులపై కర్రలతో దాడులు.. వాహనాలు ధ్వంసం - కర్నూలు జిల్లా అదోనిలో జనసేన నాయకుడిపై దాడి

ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరంలో దారుణం జరిగింది. జనసేనాని జన్మదిన వేడుకల్లో భాగంగా.. గ్రామంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వేడుకల అనంతరం కటౌట్ పక్కన నిద్రిస్తున్న గోపి అనే జనసైనికుడిపై గుర్తు తెలియన వ్యక్తులు కర్రలతో చితకబాదారు. నందిగామ 20వ వార్డు మెంబర్ అభ్యర్థి అనుచరులే దాడికి పాల్పడినట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో.. జనసేన పార్టీ అభిమాని ఆటో అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

attack-on-janasena-party-cadre-at-krishna-and-kurnool-districts

author img

By

Published : Sep 4, 2021, 5:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరంలో.. నిద్రిస్తున్న వ్యక్తిపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. సెప్టెంబరు 2న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల అనంతరం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనసేనాని జన్మదిన వేడుకల్లో భాగంగా.. గ్రామంలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వేడుకల అనంతరం కటౌట్ పక్కన నిద్రిస్తున్న గోపి అనే జనసైనికుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో చితకబాదారు. నందిగామ 20వ వార్డు మెంబర్ అభ్యర్థి అనుచరులే దాడికి పాల్పడినట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జనసేన జిల్లా సెక్రెటరీ తోట మురళీకృష్ణ విచారం వ్యక్తం చేసి.. పవన్ కల్యాణ్​కు విషయాన్ని చేరవేశారు. గోపికి జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చినట్లు మురళీకృష్ణ తెలిపారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు బాధితుడి తల్లి వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఆదోనిలో..

కర్నూలు జిల్లా ఆదోనిలో.. జనసేన పార్టీ అభిమాని ఆటో అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నెల 2న పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడని..ఆటోను ధ్వంసం చేసినట్లు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులే దాడులకు పాల్పడి.. బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. విషయాన్ని విదేశాల్లో ఉంటున్న జనసేన నాయకుడు షేక్ ఆయుబ్.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించారు. బాధితునికి ఆర్థిక సహాయం చేసి.. ఆటోలకు అద్దాలు వేయించారు. దాడికి కారణమైన వారిని పట్టుకుని శిక్షించాలని జనసేన నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

KBC: కేబీసీలో దాదా, సెహ్వాగ్​లకు కేటీఆర్​​పై ప్రశ్న.. అదేంటంటే..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.