ETV Bharat / city

ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల అసెంబ్లీ ముట్టడి.. తీవ్ర ఉద్రిక్తత..

Assembly blockade‍: ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు తమ సమస్యలు,డిమాండ్లును పరిష్కరించాలని కోరుతూ పెద్దఎత్తున అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీఆర్​ఏలపై పోలీసులు లాఠీ ఛార్జ్​ చేశారు. ఈ సంఘాల ఆందోళనల నేపథ్యంలో శాసనసభ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రత్యేక కథనం..

Assembly blockade
తెలంగాణ అసెంబ్లీ నిర్భందం
author img

By

Published : Sep 13, 2022, 7:06 PM IST

Assembly blockade‍: శాసనసభ సమావేశాల చివరి రోజు ఉద్యోగులు, కుల సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేర్చాలని పెద్దఎత్తున అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వీఆర్​ఏలపై తెలుగుతల్లి వంతెన వద్ద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో శాసనసభ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన వీఆర్​ఏలపై లాఠీఛార్జ్​:

సమస్యలు పరిష్కరించాలంటూ ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న వీఆర్​ఏలు, ఉపాధ్యాయులు, కులసంఘాలు శాసనసభ ముట్టడికి యత్నించాయి. అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నందున చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఉద్యోగులు, కులసంఘాలు వివిధ ప్రాంతాల నుంచి శాసనసభ ముట్టడికి యత్నించాయి. గతంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్‌ పెంచాలని... ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్​ఏలు శాసనసభ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్క్‌ నుంచి వస్తున్న వీరిని తెలుగుతల్లి వంతెన కింద అడ్డుకున్న పోలీసులు... లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలు కాగా... ప్రభుత్వ తీరుపై అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేస్కేలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్​ఏలకు పదవీ విరమణ ఇచ్చి, వారి పిల్లలకు ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

అసెంబ్లీని ముట్టడించడానికిి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు

ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడి:

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో టీచర్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వస్తున్న కమిటీ నాయకుల్ని హిమాయత్ నగర్‌లో పోలీసులు అడ్డుకుని, అరెస్ట్‌ చేశారు. 317 జీవో రద్దు చేయాలన్నారు. బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రెడ్డి సంఘాల, మత్స సంఘాల హామీలు అమలుకై:

2వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ రెడ్డి సంఘాలు సైతం అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మత్స్యకారుల టెండర్లను ఆంధ్ర వారికి కట్టబెట్టి, తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని ఆందోళనకు దిగారు. రాష్ట్ర మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల అసెంబ్లీ ముట్టడితో శాసనసభ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నారు. నిరసనల నేపథ్యంలో ముందుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిరసనకారుల్ని నిలువరించారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కల్లోల వాతావరణం నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.