ETV Bharat / city

ఎస్ఈసీ కార్యదర్శిగా మరోసారి అశోక్ కుమార్ - state election commission latest appointment

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా అశోక్ కుమార్ కొనసాగనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు అశోక్ కుమార్​ను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ashok kumar reappointed as sec secretary
ఎస్ఈసీ కార్యదర్శిగా మరోసారి అశోక్ కుమార్
author img

By

Published : Oct 13, 2020, 5:00 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ అశోక్ కుమార్ కొనసాగనున్నారు. గతంలో ఎస్ఈసీ కార్యదర్శిగా పనిచేసిన అశోక్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో గత ఏప్రిల్ నుంచి కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సహా ఇతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2021 డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా అశోక్ కుమార్ కొనసాగనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:'పెండింగ్​లోని ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులంన్నింటినీ పరిష్కరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.