ETV Bharat / city

అచ్చెన్న బెయిల్ పిటిషన్​పై ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వు - Achchena bail petition latest news updates

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. వచ్చే శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

ap high court
ap high court
author img

By

Published : Aug 25, 2020, 8:19 PM IST

ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు.. ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై విచారణ జరిగింది. అచ్చెన్నాయుడు నుంచి ఇప్పటికే.. ఏసీబీ అధికారులు సమాచారం తీసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కరోనాతో ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్​లో ఉంచింది. వచ్చే శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మరోవైపు ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో నిందితుడైన అశ్విన్ బెయిల్ వ్యాజ్యంపై జరిగిన వాదనలో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.