ఏపీ పురపాలక ఎన్నికల (AP Municipal Elections news) సందర్భంగా నెల్లూరులోని 43వ డివిజన్ జెండా వీధి వద్ద ఉద్రిక్తత(Tension at Municipal Elections) నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం వర్గీయులపైకి వైకాపా కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, భాజపా అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం లోపల వైకాపా ఏజెంట్ ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని ప్రచారం చేస్తున్నారని.. భాజపా ఆరోపించింది. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని సీఐకి తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఫిర్యాదు చేశారు.
స్వస్తిక్ గుర్తు కలకలం..
అనంతపురం జిల్లా పెనుకొండలోని 17వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్తుండగా తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అడ్డుకున్నారు. పోలీసులు ఎంపీ మాధవ్‌కు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించారు. అలాగే ఎన్నికలకు వాడే స్వస్తిక్ గుర్తు.. పోలింగ్ జరుగుతున్న శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాల బయట కనిపించడం కలకలం రేపింది.
చెంగలరాయుడు నిర్బంధం..
కడప జిల్లా రాజంపేటలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జి బత్యాల చెంగలరాయుడుని హోటల్‌లో పోలీసులు నిర్బంధించారు. వైకాపా పెద్దఎత్తున దొంగ ఓట్లు వేసిందని.. కమలాపురంలోనూ తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. నిరసనగా తెలుగుదేశం ఇన్‌ఛార్జి.. నరసింహారెడ్డి సొంత గ్రామమైన మాచిరెడ్డిపల్లి నుంచి తెదేపా నేతలు.. కమలాపురానికి ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వారిని కమలాపురం నుంచి ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గందరగోళ పరిస్థితులు..
ఉపఎన్నికలు జరిగిన పలు వార్డుల్లోనూ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతపురంలోని 17వ వార్డులో వైకాపా నేతలు ఇష్టానుసారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి.. దొంగ ఓట్లు వేస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. విశాఖ 31వ డివిజన్ ఉమెన్స్ కాలేజ్ వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఎంపీ విజయసాయిరెడ్డి రాకపై తెదేపా, జనసేన అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓటింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆందోళనకు దిగాయి. అంతకముందే వైకాపా, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గీయులు బాహాబాహికి దిగారు.
కాకినాడలోని 16 డివిజన్‌లో 1, 2 పోలింగ్ కేంద్రాల వద్ద తెదేపా దొంగ ఓట్లు వేస్తోందంటూ.. పలువురి గుర్తింపు కార్డులను వైకాపా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. గుంటూరులోని 6 వార్డు పోలింగ్ కేంద్రంలోకి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు వెళ్లి ఓటర్లను ప్రలోబాాలకు గురిచేశారని తెలుగుదేశం విమర్శించింది.
మందకొడిగా ఓటింగ్..
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో వర్షం కురువడంతో ఓటింగ్(AP Municipal Elections Updates) మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ప్రకాశం జిల్లా దర్శిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కర్నూలు జిల్లా బేతంచెర్ల, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాలలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
కుప్పంలో దొంగ ఓట్ల కలకలం.. లాఠీఛార్జ్
కుప్పం మున్సిపల్ పోరు తీవ్ర ఉద్రిక్తతలతో(Kuppam municipal election ended with tensions) ముగింది. దొంగ ఓట్ల కల్లోలం, అక్రమాల అడ్డగింతకు విపక్షం యత్నం, పోలీసుల లాఠీఛార్జితో.. రోజంతా అలజడి కొనసాగింది. దాడులు, బెదిరింపులు, డబ్బుల పంపిణీ, రిగ్గింగ్‌తో వైకాపా చెలరేగిపోయిందని తెలుగుదేశం ఆరోపించింది. ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి పాతరేసేలా వ్యవహరించడం దారుణమని మండిపడింది. విచ్చలవిడి అక్రమాల కంటే.. వార్డు సభ్యులను నేరుగా నామినేట్ చేసుకోవచ్చు కదా అని ఆక్రోశించింది.
దొంగ ఓటర్లను అడ్డుకోవాలంటూ పూలబజార్ సమీపంలో తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడం.. ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాణి కాలేజిలో దొరికిన స్థానికేతరుల్ని అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం వర్గీయులు ఆందోళన చేపట్టగా... పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పోలీసు దెబ్బలకు ఓ కార్యకర్త స్పృహతప్పి పడిపోయాడు. అలాగే మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఓట్లు వేస్తున్న వారిని వదిలేసి, తమపై కఠినత్వం ఏంటని తెలుగుదేశం(tension in Kuppam municipal election) నాయకులు మండిపడ్డారు
ఇవీచూడండి: