రాయలసీమ సామర్థ్యం పెంచితే రాష్ట్రానికి తీవ్రం నష్టం వాటిల్లుతుందని ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో తెలంగాణ వాదించింది. రాష్ట్రానికి ఇది జీవన్మరణ సమస్య అని పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమని స్పష్టం చేసింది. ఈ పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో మరోసారి విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేవని తెలంగాణ తరఫున ఏజీ రామచంద్రరావు వాదించారు.
ప్రాజెక్టు సామర్థ్యం 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు రెట్టింపు చేశారని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు అవసరం లేవని కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలని కోరారు. నిపుణుల కమిటీ ఏపీ చెప్పిన వాటినే విని ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని వాదించారు. కమిటీ సభ్యులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి ప్రాజెక్టు చూపెడతామని అన్నారు. ప్రాజెక్టులో భారీ మార్పులు చేసి ఇంతకుముందుదేనని ఏపీ తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 3కి వాయిదా పడింది.