ETV Bharat / city

పోలవరం నుంచి అనుసంధానానికే ఏపీ ఓటు - గోదవారి కావేరి నదుల అనుసంధానం వార్తలు

గోదావరి నుంచి కావేరి అనుసంధానంలో ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించే ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇచ్చంపల్లి నుంచి నీటి మళ్లింపునకు కసరత్తు చేస్తున్న తరుణంలో నదుల అనుసంధానంపై టాస్కుఫోర్సు కమిటీ సమావేశం గురువారం దిల్లీలో జరుగుతోంది.

పోలవరం నుంచి అనుసంధానానికే ఏపీ ఓటు
పోలవరం నుంచి అనుసంధానానికే ఏపీ ఓటు
author img

By

Published : Feb 25, 2021, 6:39 AM IST

జాతీయ టాస్కుఫోర్సు కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఇవాళ దిల్లీలో జరుగుతున్న సమావేశంలో గోదావరి కావేరి అనుసంధాన ప్రతిపాదనపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి ఎవరూ వెళ్లట్లేదు. జాతీయ జల అభివృద్ధి సంస్థ తెలంగాణ నుంచి గోదావరి నీటిని నాగార్జునసాగర్‌, సోమశిల మీదుగా గ్రాండ్‌ ఆనకట్టకు తరలించేలా మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసి గతంలోనే పంపింది. వాటిపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ అభ్యంతరాలను జాతీయ జల అభివృద్ధి సంస్థకు తెలియజేశారు. అంతకన్నా పోలవరం నుంచి అనుసంధానం చేపడితే తమకు అభ్యంతరం ఉండబోదని ఏపీ పేర్కొంటోంది.

2 చోట్ల నుంచి 3 ప్రత్యామ్నాయాలు

తెలంగాణలోని రెండు చోట్ల నుంచి గోదావరి జలాలను మళ్లించేలా జల అభివృద్ధి సంస్థ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసింది.

మొదటి ప్రత్యామ్నాయం: గోదావరిపై జానంపేట నుంచి కృష్ణాలో నాగార్జునసాగర్‌కు, అక్కడి నుంచి పెన్నాలో సోమశిల జలాశయానికి, అక్కడి నుంచి కావేరిపై గ్రాండ్‌ ఆనకట్టకు జలాల తరలింపు.. కాలువ మార్గంలోనే మళ్లింపు.

రెండో ప్రత్యామ్నాయం: గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి కృష్ణాలో నాగార్జునసాగర్‌కు, అక్కడి నుంచి పెన్నాలో సోమశిల జలాశయానికి, అక్కడి నుంచి కావేరిపై గ్రాండ్‌ ఆనకట్టకు జలాల తరలింపు.. కాలువ మార్గంలో మళ్లింపు.

మూడో ప్రత్యామ్నాయం: రెండో విధానంలో భాగంగా కాలువ కాకుండా పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించడం.

ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు...

- ప్రస్తుతం గోదావరిపై నిర్మించి ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులకు నీటిని మినహాయిస్తే ఇచ్చంపల్లి వద్ద లేదా జానంపేట వద్ద కాని నదుల అనుసంధానానికి మళ్లించేంత నీరు ఉండదు.

- ఏపీ లెక్కల ప్రకారం అంత నీటి లభ్యత లేదు. జాతీయ జల అభివృద్ధి సంస్థ ఈ మిగులు నీటిని ఎలా లెక్కించిందో ఆ వివరాలు పూర్తిగా పంపలేదు. (ఆ లెక్కలన్నీ తమకు పంపాలని ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే లేఖ రాసింది.)

- నీటి లభ్యత లేకుండా ఇచ్చంపల్లి వద్ద నుంచి అనుసంధానం చేపడితే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే నష్టపోతుంది.

- అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ పోలవరం నుంచి పెన్నాకు నీటిని మళ్లించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గోదావరిపై దిగువన ఉన్న చివరి ప్రాజెక్టు పోలవరమే. అక్కడి నుంచి నీటిని మళ్లించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇదీ చూడండి: విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.