ETV Bharat / city

ప్రజల ప్రేమ, ఆప్యాయతలను మరచిపోలేను: ఏపీ గవర్నర్ - రాజ్​ భవన్​లో మొక్కలు నాటిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఏపీ ప్రజల నుంచి లభించిన ప్రేమ, ఆప్యాయతలను మరిచిపోలేనని.. ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గవర్నర్​గా ఆయన బాధ్యతలు చేపట్టి రెండుళ్లు పూర్తి చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

ap governor bishwabushan
బిశ్వభూషణ్ హరిచందన్
author img

By

Published : Jul 24, 2021, 7:53 PM IST

ఏపీ గవర్నర్‌(governer)గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. బిశ్వభూషణ్ హరిచందన్(bishwa bushan harichandan) అన్నారు. ఆంధ్రప్రదేశ్​ ప్రజల నుంచి లభించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. విభజన అనంతరం రాష్ట్ర పూర్తిస్థాయి తొలి గవర్నర్‌గా 2021 జులై 24న.. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా.. గవర్నర్ దంపతులు రాజ్ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కరోనా విపత్కర పరిస్ధితుల కారణంగా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మొక్కలు నాటిన గవర్నర్​ దంపతులు

వారి ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేను

రాష్ట్ర ప్రజల నుంచి లభించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేను. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాజ్ భవన్ బృందం నుంచి నాకు మంచి సహకారం లభించింది. రెండేళ్లలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్వంలో చెట్ల పెంపకం, రక్తదానం వంటి కార్యక్రమాలు పూర్వం ఉన్న అన్ని రికార్డులను అధిగమించి కొత్త రికార్డులను నెలకొల్పడం అభినందనీయం. కష్టతరమైన కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రజల కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు. రక్తం అందుబాటులో లేకపోవటం వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూసేలా రెడ్ క్రాస్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

-ఏపీ గవర్నర్

ప్రజల ప్రేమ, ఆప్యాయతలను మరచిపోలేను: బిశ్వభూషణ్ హరిచందన్

ఇదీ చదవండి: MP Maloth Kavitha: ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష, 10 వేలు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.