ETV Bharat / city

AP assembly sessions: రేపు ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - తెలంగాణ వార్తలు

రేపు ఏపీ శాసనసభ సమావేశాలు (Assembly Session) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ అయి.. తదుపరి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ap cabinet meeting, ap assembly sessions
ఏపీ కేబినెట్ సమావేశం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు
author img

By

Published : Nov 17, 2021, 10:39 AM IST

ఆంధ్రప్రదేశ్​ శాసనసభ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం జరగాల్సిన కేబినెట్ సమావేశం(AP cabinet meeting news) వాయిదా పడింది. కేబినెట్ సమావేశం రేపు ఉదయం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అయ్యాక అసెంబ్లీకి హాజరుకావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్​లో జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా (AP Cabinet Meeting Postponed) పడింది. ఏపీ మంత్రి మండలి సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం (CS Office) అత్యవసర నోట్​ను జారీ చేసింది. కేబినెట్ సమావేశం నిర్వహించే తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ మంత్రులకు, అన్ని శాఖల కార్యదర్శులకు నోట్​ను సర్క్యులేట్ చేశారు. రేపు శాసనసభ సమావేశాలు (Assembly Session) ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ అయి.. తదుపరి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.