ఏపీలో గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్న పరీక్షలు వాయిదా పడ్డాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్, ఎం.ఎస్. ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.వి. సుధాకర్‌రెడ్డి తెలిపారు.
త్వరలో తిరిగి తేదీలను నిర్ణయిస్తామన్నారు. ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్షలనూ సైతం వాయిదా వేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండీ: దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్'!