హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న నాలుగు పార్లమెంట్ స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. 16 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు 12 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నామన్నారు. 60 తక్షణ స్పందన బృందాలు., 70 ప్రత్యేక భద్రత దళాలను ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 12 చెక్‌పోస్టులు, 222 పికెట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. 93 ఇంటర్ సెప్టింగ్, 20 షాడో బృందాలు పనిచేస్తాయన్నారు. ఎన్నికల తర్వాత 15 లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు.
రూ.20 కోట్లు స్వాధీనం
ఇప్పటి వరకు రూ.20.23 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు అంజనీకుమార్ తెలిపారు. వీటిల్లో 1,734 లీటర్ల మద్యం, 40 కిలోల గంజాయి ఉన్నాయన్నారు. 1,885 మందిని బైండోవర్ చేశామన్నారు. 933 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 4,618 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. 3,700 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాని స్పష్టం చేశారు.
చరవాణీలు అనుమతించం
పోలింగ్ కేంద్రంలోకి చరవాణీలను అనుమతించబోమని సీపీ స్పష్టం చేశారు. ఐదు గంటల తర్వాత ప్రచారం ఆపివేయాలన్నారు. నగరంలోని బార్లు, వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికలు ముగిసేంత వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగిరం