ETV Bharat / city

'కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకూ పోరాటం చేస్తాం'

author img

By

Published : Mar 24, 2021, 6:24 PM IST

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధింపు కోసం హైదరాబాద్​ ఇందిరాపార్క్ వద్ద కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాజీపేటకు కోచ్​ ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాడతామని నాయకులు ముక్తకంఠంతో నినదించారు.

all parties participated in protest for  kazipet coach factory at indira park

అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న కాజీపేట్​కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ సాధింపు కోసం హైదరాబాద్​ ఇందిరాపార్క్ వద్ద కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి చేపట్టిన నిరసన దీక్షలో వినోద్​ పాల్గొన్నారు. ఛలో హైదరాబాద్ నినాదంతో పోరాట సమితి చేపట్టిన నిరసన దీక్షకు అన్ని పార్టీలు, వామపక్షాలు మద్దతు పలికాయి.

కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థానిక ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యమైందని వినోద్ కుమార్ వివరించారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేంత వరకూ తెరాస మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజలకు సుదీర్ఘ స్వప్నమని... పునర్విభజన చట్టంలో కూడా కోచ్ ఫ్యాక్టరీ హామీ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి తెలిపారు. ఏప్రిల్​ 5 న దిల్లీలోని జంతర్​మంతర్ వద్ద చేయబోయే దీక్షకు సీపీఐ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు.

'కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకూ పోరాటం చేస్తాం'

ఇదీ చూడండి: సీఏ పాస్ కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.